కడప జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వంకరాజు సురేశ్ కుమార్ (21) చిత్తూరు–అరగొండ రహదారిలో బైక్‌పై వెళ్తూ వినాయక స్కూల్ సమీపంలో అదుపుతప్పి దుకాణాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ డాక్టర్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.