చిత్తూరు నగరంలో మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం వెలువడనున్న తీర్పు నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. చిత్తూరు సబ్‌డివిజన్ డీఎస్పీ టి. సాయినాథ్ తెలిపిన ప్రకారం, నగరంలో 144వ సెక్షన్ అమల్లోకి వచ్చింది. గుంపులుగా చేరడం, ర్యాలీలు లేదా సంబరాలు నిర్వహించడం పూర్తిగా నిషేధించబడింది. ప్రజలు శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని ఆయన సూచించారు.