జిల్లాల పునర్విభజనతో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహించే పుంగనూరు అన్నమయ్య జిల్లాలో విలీనం కాగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే రాజంపేట, సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే తంబళ్లపల్లి నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో లేవు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబంపై రాజకీయంగా ప్రభావం పడుతుందని చర్చ జరుగుతోంది.