గుడిపాల మండలంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ

గుడిపాల మండలం, పుల్లూరు గ్రామంలో శనివారం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాజశేఖర్, ఎంపీడీవో శిరీష, రైతులతో కలిసి పర్యటించారు. పిఎండిఎస్ క్షేత్రాలను పరిశీలించి, విత్తన గుళికలతో సాగు చేసిన పొలంలో మొలక శాతం అధికంగా రావడం, మొక్కల పెరుగుదల సమానంగా ఉండటం, తేమ నిల్వ సామర్థ్యం వంటి అంశాలను రైతులతో కలిసి పరిశీలించారు. ఎన్ఎంఈఓ ఎస్ పథకంలో భాగంగా వంద శాతం రాయితీతో సోయాబీన్ విత్తనాలను అధికారులు రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్