చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంగారుపాలెం మండలం జి. కురప్పల్లి గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈనెల మూడవ తేదీ రాత్రి, అమ్మాయి పిలిచిందని వెళ్లిన జయదీప్, అర్ధరాత్రి బండిపై నుంచి పడిపోయాడని, ఆసుపత్రిలో చేర్చామని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు గుమిగూడి, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది.