చిత్తూరు పట్టణంలో టీడీపీ శ్రేణుల ఆగ్రహం

మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం చిత్తూరులో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద మహిళా నేతలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మకు దేహశుద్ధి చేసి, నిప్పు పెట్టారు. విచక్షణ మరిచి మాట్లాడిన అంబటి తక్షణం క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్