ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గార్గేయనది

కొద్దిరోజులుగా సదుం మండల పరిధిలో, ఎగువనున్న సోమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో చెరువులు, వంకలు నిండి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గార్గేయ నది శనివారం రాత్రి నుంచి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. కొర్లకుంట వారి పల్లి సమీపంలో కల్వర్టుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్