నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం..అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా

పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామంలో రూ. 21 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. కాంట్రాక్టర్ నిర్మాణం పూర్తి చేసినా, అధికారులు స్పందించకపోవడంతో ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారి, చెట్లు, పొదలతో నిండిపోయి భయానకంగా కనిపిస్తోంది. ప్రజలు ఈ భవనాన్ని ప్రజాప్రయోజనార్థం ఉపయోగంలోకి తీసుకురావాలని, ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్