కార్వేటినగరం కట్టడాలకు పేరుపొందిన ప్రదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరు ఇక్కడ ఉంది. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేరును 1857 నుంచి 1885 మధ్య కరువు సమయంలో అప్పటి రాజు వెంకట పెరుమాళ్ రాజు తవ్వించారట. ఇక్కడ పని చేసినవారికి చేతి నిండా నాణేలు ఇచ్చేవారని చెబుతారు. ఈ కోనేరు నాలుగు దిశల నుంచీ సమాంతరంగా కనిపించడం ప్రత్యేకత.