చిత్తూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే గంగమ్మ జాతరను మే 12, 13 తేదీలలో వైభవంగా నిర్వహించనున్నట్లు గంగజాతర వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు బుధవారం రాత్రి తెలిపారు. మే 5న జాతర చాటింపు, 12న తొలి పూజలు, మహా కుంభనైవేద్యం, 13న నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.