చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. పలు దుకాణాల్లో బాయిలర్ కోడి కిలో రూ. 157 నుంచి రూ. 165 వరకు అమ్ముడవుతోంది. మాంసం ధర రూ. 243 నుంచి రూ. 275 వరకు ఉందని దుకాణదారులు తెలిపారు. స్కిన్ లెస్ చికెన్ రూ. 275 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. కోడిగుడ్ల ధర 12కు రూ. 84గా ఉంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.