జీడి నెల్లూరులో వెన్నుపోటు దినం

జీడి నెల్లూరు నియోజకవర్గంలో శుక్రవారం మాజీ మంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృపా లక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే భారీ అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, నిరుద్యోగులను మోసం చేయడం వంటి ఆరోపణలు ఆమె చేశారు.

సంబంధిత పోస్ట్