జీడి నెల్లూరు: అప్పటినుంచి దాడులు ప్రారంభం.. కృపా లక్ష్మి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, దళితులు, విద్యార్థులపై దాడులు పెరిగాయని వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి ఆరోపించారు. సోమవారం జీడి నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్