జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, పాతడేరా కండ్రిగలో సుబ్రహ్మణ్యం అనే రైతు అక్కడి లైన్మెన్ పై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తన పొలంలోని 30 మామిడి చెట్లను లైన్మెన్ ఎటువంటి సమాచారం లేకుండా నరికేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మామిడి పంటకు ధర లేకుండా తాము ఇబ్బందులు పడుతుంటే ఇలాంటివి జరగడం చాలా బాధాకరమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.