శ్రీరంగరాజపురం మండలం, కమ్మకండ్రిగ పంచాయతీలోని మిట్ట కండ్రిగ హరిజనవాడలో రైతు నవీన్ కు చెందిన ఐదు ఎకరాల చెరుకు తోట మంగళవారం అగ్నికి దగ్ధమైంది. మార్కెట్ కు తరలించడానికి సిద్ధంగా ఉన్న బెల్లం కూడా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 10 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.