మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తమపై పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని అన్నారు. గురువారం ఆయన ఎస్.ఆర్.పురం లో మాట్లాడుతూ, ఖనిజ సంపదలతో నిండిన గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై డ్రోన్ నిఘా పెట్టి, ఆధారాలు సేకరించిన తర్వాత మాట్లాడతానని తెలిపారు. జీడి నెల్లూరులో జరుగుతున్న దోపిడీపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.