జీడి నెల్లూరు: ఆ గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జీడి నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో వారం రోజులుగా పులి సంచారంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మోపిరెడ్డిపల్లిలో గడ్డి కోస్తున్న రైతు పొలం పక్కన పులి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందింది. అధికారులు పరిశీలించి, అది పులి కాదని, ఇతర జంతువని తెలిపారు. అయినప్పటికీ, మంగళవారం మోపిరెడ్డిపల్లి, ఎగువచెరువు, సీస్ అగ్రహారం గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు దండోరా వేయించి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్