జీడి నెల్లూరు: బావిలో మృతదేహం కలకలం

జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలోని అంకనపల్లి ప్రజలు గురువారం ఉదయం ఉలిక్కిపడ్డారు. ఇందుకు కారణం గ్రామ సమీపంలోని బావిలో మృతదేహం లభ్యమైంది. స్థానికుల వివరాలు మేరకు మృతుడు పాలసముద్రం మండలంలో ఓ ప్రైవేటు పాల డైరీలో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించి నట్లు సమాచారం. ఈ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్