పెనుమూరులో బహిరంగంగా మద్యం సేవించిన వారికి జరిమానా

పెనుమూరు మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన పదిమందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. సోమవారం చిత్తూరు సెకండ్ స్పెషల్ కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున రూ. 10 వేలు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్