గంగాధర నెల్లూరు నియోజకవర్గం మాంబేడు గ్రామంలో శనివారం ప్రసవ సమయంలో ఆవు ప్రాణాపాయంలో పడింది. సమాచారం అందుకున్న పచ్చికాపల్లం పశువైద్యుడు మధు హుటాహుటిన చేరుకొని, మృత దూడను శస్త్రచికిత్స ద్వారా తొలగించి ఆవు ప్రాణాలు కాపాడారు. సేవా ధనతకు రైతు కుటుంబం, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.