జీడి నెల్లూరు నియోజకవర్గంలో దంచి కొట్టిన వర్షం

జీడి నెల్లూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోగా, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారి కుండపోత వర్షం కురిసింది. సాధారణంగా వర్షం రైతులకు మేలు చేసినా, ఈ ఏడాది అకాల వర్షాల వల్ల మామిడి, వరి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్