జీడి నెల్లూరు: బాలుర వసతి గృహంలో అడ్మిషన్లు ప్రారంభం

జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం బాలుర వసతి గృహంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని హాస్టల్ సంక్షేమ అధికారి దశరథన్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హాస్టల్లో విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని అధికారి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు వసతి గృహంలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్