జీడి నెల్లూరు: పీహెచ్సీలో కుష్టి వ్యాధి దినోత్సవం

జీడీ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం డా. ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం నిర్వహించారు. కుష్టు వ్యాధి నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏ.డి.టి వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చని వైద్యాధికారి తెలిపారు. శరీరంలో నొప్పిలేని మచ్చలు, పొడలు, బుడిపలు, వెంట్రుకలు లేని కనుబొమ్మలు వంటి లక్షణాలు ఉంటే స్థానిక వైద్యాధికారులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్