శనివారం బెంగళూరులోని నిచర్ ఇండస్ట్రియల్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే సందర్శించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు, విస్తరణపై ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపార యజమానులతో ఎన్ఐటిపి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎం. హరి రాజు, కిశోర్ కుమార్, కె. రమేష్ బాబు, ఈ. అయ్యదోర హేమనాథ్, ఎస్. మహేష్ వంటి ముఖ్య పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.