జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, యనమల మంద యూపీ స్కూల్ ను కొనసాగించాలని బుధవారం రాష్ట్ర మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ కు తెలిపారు.