జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ ఆర్ పురం మండలం, కొత్తపల్లి మిట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన కాంపౌండ్ వాల్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రభుత్వ విప్, నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.