జీడి నెల్లూరు: ప్రేమ పేరుతో మోసపోయిన యువతి

జీడి నెల్లూరుకు చెందిన యువతికి కడపకు చెందిన శివశంకర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారడంతో యువతి అతడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ఇచ్చినా, 15 రోజుల క్రితం యువకుడికి వేరే అమ్మాయితో సంబంధాలున్నాయని గమనించింది. మోసపోయానని యువతి ఫిర్యాదు చేయడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం శివశంకర్‌ను అరెస్ట్ చేసినట్లు నెల్లూరు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. పేద పిల్లలు, విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్