జీడి నెల్లూరు: పాఠశాల బస్సును ఢీకొన్న కంటైనర్

శుక్రవారం, జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం సమీపంలో భానోదయ స్కూలుకు వెళ్లే పాఠశాల బస్సును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు విద్యార్థులు బస్సులో ఇరుక్కుపోగా, కట్టర్ల సహాయంతో వారిని బయటకు తీశారు. స్వల్ప గాయాలైన వారిని చిత్తూరు ఆసుపత్రికి, తీవ్ర గాయాలైన వారిని చిలపల్లి సిఎంసికి తరలించారు.

సంబంధిత పోస్ట్