రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి ఎస్ ఆర్ పురం మండలంలో జరిగింది. వివరాలలోకి వెళితే ఎస్ ఆర్ పురం మండలంలోని సీకే పురం వద్ద కొండపాలెం ఎస్టీ కాలనీకి చెందిన లోకేష్ (25) ద్విచక్ర వాహనంలో పుల్లూరు క్రాస్ కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా చిత్తూరు-పుత్తూరు రహదారిపై పల్లిపట్టుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అతడిని ఢీ కొట్టడంతో లోకేష్ అక్కడికక్కడే మృతిచెందాడు.