తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాంటిదని, చిన్నచిన్న మనస్పర్థలు సహజమని, వాటిని పక్కనపెట్టి అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ పిలుపునిచ్చారు. ఆదివారం జీడి నెల్లూరు మండల కేంద్రంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.