కార్వేటి నగరం: భక్తిశ్రద్ధలతో రథోత్సవం

జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం లోని టీటీడీ శ్రీసంతాన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రుక్మిణి సత్యభామ సమేతుడై స్వామివారు రథంపై పురవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్