కార్వేటినగరం కోట చెరువులో గురువారం మతిస్థిమితం లేని మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం చుట్టుపక్కల భిక్షాటన చేస్తూ జీవించే ఆమె, చెరువులో శవంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికని వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఏఎస్సై గోవిందయ్య దర్యాప్తు చేస్తున్నారు.