పాలసముద్రంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సోమవారం, పాలసముద్రం మండలంలో జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్