జీడి నెల్లూరు: పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జీడి నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం మండలంలోని తూర్పుపల్లి హరిజనవాడలో నిర్వహించన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పింఛన్లు అందజేశారు. పేద ప్రజలను పింఛన్ల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్