జీడి నెల్లూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం, ఆళ్ళమడుగు హరిజనవాడలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి ఎన్ థామస్ పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి అనేక పథకాలను ప్రవేశపెడుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్