జీడి నెల్లూరు: పట్టుబడ్డ మద్యాన్ని ధ్వంసం చేసిన అధికారులు

పాలసముద్రం పోలీస్ స్టేషన్ పోలీసులు, చిత్తూరు ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఎక్సైజ్ కేసులలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం 365.38 లీటర్లను ధ్వంసం చేశారు. 24 ఐడి అరాక్ కేసులలో 331 లీటర్లు, 6 డిపిఎల్ కేసులలో 34.38 లీటర్ల మద్యం ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టామని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్