పాలసముద్రం: మహావిష్ణువు దేవాలయంలో కుంభాభిషేక వేడుకలు

జీడి నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం మిద్దెనెత్తం గ్రామంలోని మహావిష్ణు దేవాలయంలో బుధవారం కుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ యుగంధర్ కూడా పాల్గొని, స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్