జీడి నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం, ఏనుకొండయ్యపల్లి గ్రామంలో వెలసిన సాయిబాబా మందిరాన్ని ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ శుక్రవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు స్థానిక మహిళలు మంగళ హారతులు పట్టారు. అనంతరం సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. నిర్వాహకులు డాక్టర్ థామస్ కు తీర్థ ప్రసాదాలను అందించారు.