ఆగని ఒంటరి ఏనుగుల దాడులు

పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం పాళ్యం పంచాయతీలో మామిడి తోటలపై దాడి చేసి, మామిడి చెట్లను ధ్వంసం చేసింది. రైతులు సుబ్బరామయ్య, దామోదర్, వినాయక, దామోదర్ నాయుడుల పంటలకు నష్టం వాటిల్లింది. పశుగ్రాసం, జొన్న పంటలను తొక్కేసి, అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్