గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాచిగుంట గ్రామపంచాయతీ, బాలాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, వాటర్ బోర్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం. థామస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని, అధికారులకు పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.