గూడూరులో 54వ రోజుకు చేరిన జిల్లా సాధన దీక్షలు

గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా సాధన దీక్షలు బుధవారం 54వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయుడు మాట్లాడుతూ, గూడూరు అంశంపై సీఎం, డీసీఎం మౌనం వహించడంపై ప్రశ్నించారు. గూడూరును జిల్లా చేయాలని, లేనిపక్షంలో ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్