మద్యం సేవకులకు అడ్డాగా ఖాళీ ప్రదేశాలు

గూడూరు పట్టణంలోని ఖాళీ ప్రదేశాలు, లేఔట్లు మద్యం సేవకులకు అడ్డాలుగా మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సనత్‌నగర్‌లోని ఓ లేఔట్‌లో రాత్రి వేళల్లో మద్యం సేవిస్తూ సీసాలు పగులగొడుతున్నారని స్థానికులు తెలిపారు. దీనివల్ల ఆ ప్రాంతం గుండా వెళ్లే మహిళలు, వృద్ధులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. పగిలిన మద్యం సీసాలు, వాటర్ బాటిళ్లతో అసౌకర్యం ఏర్పడుతోంది. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్