చిట్టమూరు మండలం పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డివాగు గ్రామంలో శుక్రవారం వెలుగు ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు స్వయం ఉపాధి సాధనంగా కోళ్ల పెంపకం యూనిట్లను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారని, దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి, కుటుంబ ఆదాయం మెరుగుపడుతుందని ఆయన అన్నారు.