చిల్లకూరు మండలం తొణుకుమాల ప్రాంతంలో తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని కోసుకోనీయకుండా రమేష్ రెడ్డి, శేషు రెడ్డి అడ్డుకుంటున్నారని సిద్ధమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఎంఆర్వో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి, పంట కోయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పలువురు రైతులు పాల్గొని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.