పెళ్లకూరు మండలం చిల్లకూరు సమీపంలో జాతీయ రహదారి-71 ఫ్లైఓవర్‌పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల దర్శనం అనంతరం నెల్లూరుకు తిరిగి వెళ్తున్న కారును వెనుక నుంచి ట్రాలీ లారీ ఢీకొట్టడంతో జస్వి (4) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజు శ్రీనివాస్ రెడ్డి, సుమీ జోసెఫ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.