గూడూరు: పరీక్షా కేంద్రంలో ఇంటర్ విద్యార్థికి అస్వస్థత

గూడూరులోని సెయింట్ మేరీస్ కాలేజీలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ధనుష్ పరీక్ష రాస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. విషయాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, వారు ధనుష్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం, బలహీనత, పరీక్షల ఒత్తిడి కారణంగా విద్యార్థి అస్వస్థతకు గురై ఉండవచ్చు. సెలైన్ ఎక్కించి, వైద్య పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం ధనుష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్