హైదరాబాద్‌లో జూలై 28 నుండి ఆగస్టు1 వరకు జరిగిన ఐటా ఉమెన్స్ వన్ ల్యాక్ టోర్నమెంట్‌లో గూడూరుకు చెందిన లక్ష్మీ సిరి దండు విజేతగా నిలిచారు. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో తమిళనాడుకు చెందిన జోయల్ నికోల్‌ను 6-1, 6-3 స్కోరుతో ఓడించారు. సెమీస్‌లో మనోజ్ఞ మదసుపై, క్వార్టర్ ఫైనల్‌లో తానియాపై గెలిచారు. ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు సాధించారు.