గూడూరు: చిల్లకూరులో పోలీసుల విస్తృత తనిఖీలు: 16 వాహనాలు సీజ్

గూడూరు డీఎస్పీ గీత కుమారి ఆదేశాల మేరకు, శనివారం చిల్లకూరు మండలం పారిచెర్లవారి పాలెంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 16 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు మరింత కఠినతరం చేయబడతాయని, వాహనదారులు తప్పనిసరిగా అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్