తిరుపతి జిల్లాలో ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న గూడూరులో ఏకంగా 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని మరో 25 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర ఎండలు ఉండే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీళ్లు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.