వాకాడు మండలం గంగన్న పాలెం గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం గంగన్న పాలెం సాయిబాబా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు చేశారు.మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులందరూ రావాలని సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.